బిహైండ్ ధ మూవీ ఆఫ్ కంగువా... 1 m ago
కంగువా, ఎ మైటీ వాలియంట్ సాగా (ఉప శీర్షిక). దర్శకుడు శివ స్వీయ రచనలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారతీయ ఫాంటసీ యాక్షన్ చిత్రాల్లో ఇదీ ఒకటి. ఈ చిత్రంలో సూర్య, బాబీ డియోల్, దిశా పటానీ, జగపతి బాబు, నటరాజన్ సుబ్రహ్మణ్యం, యోగి బాబు, రెడిన్ కింగ్స్లీ, కోవై సరళ, ఆనందరాజ్, కేఎస్ రవికుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సూర్య, శివల కాంబోలో ఈ భారీ ప్రాజెక్ట్ 2019 ఏప్రిల్లోనే ప్రకటించారు. కానీ, కోవిడ్-19 మహమ్మారి కారణంగా షూటింగ్ వాయిదా పడింది. తిరిగి 2022 ఆగస్టులో చిత్రీకరణ పట్టాలెక్కింది. సూర్య 42 వర్కింగ్ టైటిల్‌తో చెన్నై, గోవా, కేరళ, కొడైకెనాల్, రాజమండ్రిలో షూటింగ్ జరుపుకుంది. ఇక సాంకేతిక బృందం విషయానికొస్తే.. దేవి శ్రీ ప్రసాద్ స్వరాల సమకూర్చగా, సినిమాటోగ్రాఫర్‌గా వెట్రి పళనిస్వామి, నిషాద్ యూసుఫ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. కంగువా రూ.300-350 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందించబడింది. మాయవి (2005), ఆరు (2005), సింగం (2010), సింగం II (2013) తర్వాత సూర్యతో తన ఐదవ చిత్రంగా కంగువతో దేవి శ్రీ ప్రసాద్ సౌండ్ట్రాక్ మరియు సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ను స్వరపరిచారు.
డిజిటల్, ఆడియో, శాటిలైట్ మరియు డిస్ట్రిబ్యూషన్ హక్కులతో సహా ₹500 కోట్లకు పైగా ప్రీ-రిలీజ్ బిజినెస్ చేయింది. ఇంత ఎక్కువ బిసినెస్ చేసిన మొదటి తమిళ చిత్రంగా నిలిచింది. లియో (2023) యొక్క మునుపటి రికార్డును అధిగమించింది.
మొదటి సింగిల్ "ఫైర్ సాంగ్" 23 జూలై 2024న సూర్య 49వ పుట్టినరోజు సందర్భంగా విడుదలైంది. రెండవ సింగిల్ "యోలో" 21 అక్టోబర్ 2024న విడుదలైంది.నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా ప్రామాణిక మరియు 3D లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని స్టీరియోస్కోపిక్ కన్వర్షన్ స్టూడియో రేస్ 3డి ద్వారా 3డి ఫార్మట్లో మార్చడం జరిగింది. ఇది మొదట్లో 10 అక్టోబర్ 2024న దసరా సందర్భంగా థియేటర్లలో విడుదల కావాల్సి ఉందగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన వెట్టయ్యన్ తో ఘర్షణ పడకుండా ఉండటానికి ప్రస్తుత తేదీకి వాయిదా వేయబడింది.
ఈ చిత్రం యొక్క భారతీయ దక్షిణ ప్రాంత భాషల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసింది.